ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్మిలేరు జలాశయం మూడు గేట్లు ఎత్తివేత - tammileru reservoir latest news

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా వరద నీరు చేరడంతో... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని తమ్మిలేరు జలాశయం మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

three gates lifted in tammileru reservoir
తమ్మిలేరు జలాశయం మూడు గేట్లు ఎత్తివేత

By

Published : Aug 21, 2020, 3:19 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా వరద నీరు చేరడంతో... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని తమ్మిలేరు జలాశయం మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయం వరద నీటితో పూర్తిగా నిండిపోయింది. రిజర్వాయర్ సామర్థ్యం 355 అడుగులు కాగా ప్రస్తుతం 348.5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో రిజర్వాయర్​కు ఉన్న మూడు గేట్లనుంచి... సుమారు 3వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

వరద తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏలూరు తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దిగువన ఉన్న చింతలపూడి లింగపాలెం మండలాలు, కృష్ణా జిల్లా చాట్రాయి మండలం, ఏలూరు పరిసర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details