పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖ జిల్లా ధార్వాడ అటవీ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు లారీలో తరలిస్తున్న 514 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 30 లక్షల పైనే ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి లారీని సీజ్ చేశామన్నారు.
514 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని, దొంగతనం కేసులో మరో నలుగురిని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ అరెస్ట్ చేశారు.
గంజాయి రవాణా చేసినవారు, దొంగలు అరెస్టు
కొయ్యలగూడెం మండలం ధర్మరావు పేటలో ఓ ఇంట్లో గత నెలలో జరిగిన చోరీనీ పోలీసులు ఛేదించారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన నలుగురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి నాలుగు లక్షలు విలువ చేసే 15 కాసుల బంగారం అర కిలో వెండిని స్వాధీనపర్చుకున్నారు. పట్టుబడిన నిందితులపై జిల్లాలో పలు స్టేషన్లో 15కు పైగా కేసులు ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ తెలిపారు.
ఇదీ చదవండికమీషన్లు రాక రేషన్ డీలర్ల ఇబ్బందులు