వైఎస్సార్ వాహనా మిత్ర పథకానికి అర్హులైన వాహనదారులు దరఖాస్తు చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ సిరి ఆనంద్ తెలిపారు. సొంత వాహనాలుగా మ్యాక్సీ క్యాబ్‌లు, ఆటో రిక్షాలు, మోటార్ క్యాబ్‌లు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు చొప్పున ఈ పథకం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
'అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి' - సిరి ఆనంద్ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన వారు వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరాఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ సిరి ఆనంద్ తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకొవటానికి ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. గతంలో లబ్ధి పొందిన వాహనదారులు తమ పేర్లు జాబితాలో ఉందా లేదో పరిశీంచుకోవాలని తెలిపారు.
రవాణా శాఖ ఉప కమిషనర్ సిరి ఆనంద్
రెండేళ్ల కాలంలో 35,695 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని సిరి ఆనంద్ వెల్లడించారు. గతంలో లబ్ధి పొందిన వాహనదారులు తమ పేర్లు జాబితాలో ఉందో లేదో పరిశీంచుకోవాలని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. నూతన దరఖాసుదారులకు ఆరు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
ఇదీ చదవండి