ముఫ్పై మూడు సంవత్సరాల నాటి జ్ఞాపకాలు...మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు...పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రజలకు అంతటి చేదు అనుభవాలను, కష్టాలను ఆరోజు 1986వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీ ఆ రోజు గోదావరికి ఎగువన కురిసిన భారీ వర్షాలకు నది ఉగ్రరూపం దాల్చటంతో తణుకు పట్టణాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న గోస్తనీ నది ఉప్పొంగి ప్రవహించి పట్టణాన్ని ముంచెత్తింది.
దీంతో పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ జలమయమయ్యాయి. పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల ముందు ప్రధాన రహదారిపై సుమారు నాలుగు అడుగులలోతు వరదనీరు ప్రవహించింది. ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టణ ప్రజలు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంల మీద జాతీయ రహదారి పక్కన గట్లమీద పదిరోజుల పాటు తలదాచుకున్నారు.
33 సంవత్సరాల కిందట వరద ..మళ్లీ పునరావృతం - 1986వ సంవత్సరం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇంతటి వరద ఉగ్రరూపన్ని గతంలో ఎన్నడూ చూడని తణుకు ప్రజలు వరద ప్రస్తావన వస్తే చాలు ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంన్నారు.
వరద
ఇదీ చదవండి:సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు
.