ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడో విడత రేషన్... బయోమెట్రిక్ తప్పనిసరి

రాష్ట్రంలో మూడో విడత రేషన్ పంపిణీకి పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. బియ్యంకార్డు ఉన్నవారికి ఈ నెల 29 నుంచి మే 10 వరకూ సరకులు అందించాలని ఆదేశాలిచ్చింది. లబ్ధిదారులకు సరకులు పంపిణీలో ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణాల వద్ద మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. రోజుకు 30 మందికే రేషన్ సరకులు పంపిణీచేయాలని రెవెన్యూ అధికారులు, డీలర్లకు మార్గదర్శకాలిచ్చింది.

Third time Ration distribution in ap
మూడో విడత రేషన్... బయోమెట్రిక్ తప్పనిసరి

By

Published : Apr 27, 2020, 10:28 AM IST

లాక్‌డౌన్ దృష్ట్యా పేదలకు మూడోవిడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేషన్ పంపిణీకి రెవెన్యూ అధికారులు, డీలర్లకు పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. బియ్యంకార్డు ఉన్నవారికి ఈ నెల 29 నుంచి మే 10 వరకు ఉచితంగా సరకులు అందించాలని ఆదేశాలిచ్చింది. కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ రేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. టైంస్లాట్ టోకెన్లతో ఒక్కో దుకాణంలో రోజుకు 30 మందికే సరకుల పంపిణీ చేయాలని, ఈసారి లబ్ధిదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణాల వద్ద మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపింది. బయోమెట్రిక్‌కు ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details