వీఆర్ఓ కూరగాయలు కొనుగోలు చేద్దామని బైక్ పక్కనపెట్టి మార్కెట్ వెళ్లాడు. అయితే ఇది గమనించిన దొంగలు బైక్‌లో ఉంచిన బ్యాగ్ కొట్టేశారు. ఆ బ్యాగ్‌లో రూ.4.2 లక్షలు ఉన్నాయని బాధితుడు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో జరిగింది.
బైక్ పక్కనపెట్టి కూరగాయలు కొందామని వెళ్లాడు...తిరిగొచ్చేసరికి.. - పశ్చిమ గోదావరి
కూరగాయలు కొనడానికి వచ్చిన వీఆర్ఓ..బైక్‌ను పక్కకు నిలిపాడు. అంతకుముందు బ్యాంకు నుంచి తెచ్చిన రూ.4.2 లక్షలు బైక్‌లో ఉంచాడు. కాగా వీఆర్ఓ కూరగాయలు కొంటుండగా బైక్‌లో ఉన్న మొత్తం డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు.
దొంగతనం
పెనుమంట్ర వీఆర్ఓగా పని చేస్తున్న విస్సాకోడేరు వాసి రాజు.. ఎస్బీఐ నుంచి రూ.4.2 లక్షలు రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చుదామని డబ్బులు తీసుకుని.. బైక్‌లో పెట్టి ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో కూరగాయలు కొందామని బ్యాగ్‌ను బైక్‌లోనే ఉంచి వెళ్లాడు. ఈలోపు దొంగలు ఆ డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.
ఇదీ చదవండి:GUTKA CAUGHT: అక్రమంగా తరలిస్తున్న గుట్కా, మద్యం పట్టివేత