ఏటీఎం వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకొని.. నగదు అపహరిస్తున్న సురేంద్రకుమార్ అనే దొంగను పశ్చిమగోదావరిజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుడు ఇప్పటి వరకూ 44 ఏటీఎం మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కృష్ణా, ఉభయగోదావరిజిల్లాల్లో ఏటీఎం మోసాలకు పాల్పడుతూ.. రూ. 18.50 లక్షల నగదు, 23 లక్షల విలువైన బంగారు అభరణాలను అపహరించాడు. ఏటీఎంల వద్ద మాటువేస్తూ.. పూర్తి పరిజ్ఞానంలేని వినియోగదారులకు సాయం చేస్తానని నమ్మించి నకిలీ ఏటీఎం వారికి ఇచ్చి.. అసలైన ఏటీఎంను తీసుకొని నగదును అపహరించేవాడు. దొంగలించిన కార్డులతో బంగారు దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసేవాడు. ఏటీఎంల వద్ద సాయం చేస్తామంటూ మోసాలకు పాల్పడేవారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.