ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యారావుపాలెం పీఏసీఎస్​లో భారీ కుంభకోణం - west godavari district crime news

పశ్చిమగోదావరి జిల్లా సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీ కుంభకోణం జరిగింది. రైతులు కూడబెట్టిన సొమ్ము... బ్యాంకు ఖాతాలో నుంచి మాయమైంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు... డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్నారు.

SURYARAOPALEM PACS
SURYARAOPALEM PACS

By

Published : Sep 16, 2020, 4:15 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్​)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. డిపాజిటర్లకు చెందిన సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర సొమ్ము గల్లంతయ్యాయి. తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ డిపాజిటర్లు సహకార సంఘం ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.

సూర్యారావుపాలెం సహకార పరపతి సంఘంలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సొమ్మును డిపాజిట్ చేశారు. గత సంవత్సరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... అప్పటి వరకు ఉన్న పాలక వర్గాలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేసే నాటికి సంఘంలో 5 కోట్ల రూపాయలు పైగా డిపాజిట్లర్లకు చెల్లించాల్సి ఉండగా.... 89 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంకులో ఉన్నాయి. తాజాగా మరోసారి పరిశీలించగా.... నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉండగా... బ్యాంకులో 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. డిపాజిటర్ల సొమ్ము గల్లంతైనట్లు గుర్తించిన కొత్త పాలక వర్గం... సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. సహకార శాఖ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించగా... జరిగిన అవకతవకలపై విచారణ చేసింది. నివేదికలను విడుదల చేయాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవటంతో పాటు డిపాజిటర్లకు న్యాయం చేస్తామని పాలకవర్గం చెబుతోంది.
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details