ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అపోహలతో అపాయం లేదు" - తణుకులో తగ్గిన చికెన్ ధరలు

కరోనా వైరస్ ప్రభావంతో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్న సమయంలో వాటిని అభివృద్ధి చేసే క్రమంలో చికెన్ సెంటర్ వాళ్లు అమాంతం రేటు తగ్గించి వ్యాపారాలు పెంచే క్రమంలో పడ్డారు. నిన్న, మెున్నటి వరకు 160, 180 ఉన్న చికెన్ ధర కరోనా వైరస్ ప్రభావంతో 40 రూపాయలకు దిగివచ్చింది.

there-is-no-danger-with-myths
"అపోహలతో అపాయం లేదు"

By

Published : Mar 16, 2020, 7:08 AM IST

"అపోహలతో అపాయం లేదు"

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ భయంతో వారం రోజుల పాటు పాలకులు చికెన్, మటన్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. అక్కడ నుంచి చికెన్ వ్యాపారస్థులు , పౌల్ట్రీ పరిశ్రమ వాళ్లకి కష్టాలు మెుదలయ్యాయి. తణుకు , నిడదవోలు , తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలో కోళ్ల పెంపక ఫారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు పడిపోయి కోళ్ల కు మేత పెట్టలేని స్థితి లో ఈ ఆదివారం చికెన్ ధర 40 రూపాయల చేశారు. అదే స్కిన్ లెస్ 60 రూపాయలుగా అమ్మకందారులు బోర్డులు పెట్టడంతో గత మూడు వారాల కంటే ఈ వారం ఒక యాభై శాతం సరుకు అదనంగా అమ్ముడు అయిందని వ్యాపారస్తులు ఆనందిస్తున్నారు.అటు పౌల్ట్రీ వారి పరిస్థితి చూస్తే ఒక కోడి ఉత్పత్తికి 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుండగా గత మాసం రోజుల నుంచి కోళ్ల కు పెట్టే మేత భారంగా మారడంతో గుడ్డిలో మెల్ల అన్నట్లు 40 రూపాయల ధరకే విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి:అరకిలో బంగారు ఆభరణాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details