ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు - మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో దొంగతనం

పోలవరం ప్రాజెక్ట్ మేఘా ఇంజినీరింగ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నారని ప్రశంసించారు.

theft in megha engineering camp office cash recovery
నారాయణ నాయక్, పశ్చిమగోదావరి ఎస్పీ

By

Published : Aug 7, 2020, 6:33 PM IST

పోలవరం ప్రాజెక్ట్ మేఘా ఇంజినీరింగ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు. రూ.52 లక్షలు దొంగతనం చేసిన సెక్యురిటీ గార్డును 12 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చోరీ జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితున్ని పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్నట్లు పక్కా సమాచారంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా సులువుగా కేసును ఛేదించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details