పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు గునపాలతో ఆలయంలోని హుండీని పగలగొట్టి.. నగదును అపహరించారు. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలను సైతం దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు.
ఆకివీడు వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ.. రూ.10లక్షలు విలువైన ఆభరణాలు అపహరణ - పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వేణుగోపాలస్వామి గుడిలో దొంగతనం వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు.. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![ఆకివీడు వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ.. రూ.10లక్షలు విలువైన ఆభరణాలు అపహరణ theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11543265-527-11543265-1619430844852.jpg)
దొంగతనం