ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య మృతిచెందిన కొన్ని రోజులకే... భర్త బలవన్మరణం - eluru crime updates

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం జరిగింది. కొన్నిరోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందటంతో... మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.

భార్య చనిపోయిన కొద్దినెలల్లోనే  భర్త మృతి

By

Published : Oct 26, 2019, 10:28 AM IST

Updated : Oct 26, 2019, 1:16 PM IST

భార్య మృతిచెందిన కొన్ని రోజులకే... భర్త బలవన్మరణం

తన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక... మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. పట్టణానికి చెందిన మల్లికార్జునరావు ఔషధ, వస్త్ర దుకాణాలు నిర్వహిస్తూ జీవించేవాడు. కొన్ని రోజు క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతిని జీర్ణించుకోలేకపోయిన మల్లికార్జునరావు... ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

Last Updated : Oct 26, 2019, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details