ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తి తగాదాలు... తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన కుమారుడు - నరసాపురం నేర వార్తలు

ఆస్థి తగాదాల నేపథ్యంలో నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కుమారుడు అతి కిరాతకంగా నరికి... తల మొండెం వేరు చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టీ.నరసాపురం మండలంలో జరిగింది.

mother killed
ఆస్తి తగాదాలు... తల్లిని అతికిరాతరంగా హత్య చేసిన కుమారుడు

By

Published : Jul 27, 2020, 10:02 PM IST

ఆస్తి తగాదాలు... తల్లిని అతికిరాతంగా హత్య చేసిన కుమారుడు

పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన పేరుబోయిన సరోజినికి ముగ్గురు పిల్లలు. భర్త పదేళ్ల క్రితం మృతి చెందటంతో పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహం చేసి చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. తనకున్న ఐదెకరాల భూమిని ఎకరంన్నర చొప్పున కూతురు, ఇద్దరు కుమారులకు పంచిపెట్టింది. దీంతో పెద్ద కుమారుడు పేరబోయిన శ్రీను తన పొలంలో నిమ్మ తోటను వేసి... అనంతరం కౌలుకు ఇచ్చాడు. కుబుంబంలో మూడు లక్షల వరకు బాకీలు ఉన్నాయని వాటిని తీర్చాలని తల్లి ముగ్గురిని కోరింది. బోరు వేసేందుకు 3 లక్షల వరకు అప్పు చేశామని బాకీ తీర్చే వరకు నిమ్మ కాయలు కోయడం కుదరదని తల్లి సరోజిని కౌలు రైతుకు చెప్పడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం కౌలు రైతు నిమ్మ కాయలు కోస్తుండగా తల్లి అడ్డుకోవటంతో కోపోద్రిక్తుడైన కుమారుడు శ్రీను తోటలో పశువులు కాస్తున్న తల్లి సరోజిని వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై నరికినట్లు మృతురాలి కుమార్తె ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చూడండి-'నా లేఖను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండి... ఇదే చివరి కోరిక'

ABOUT THE AUTHOR

...view details