స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలకు సంబంధించి సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగనుంది. తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో 9 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా ఆయా గ్రామపంచాయతీల్లోని కొన్ని వార్డులు సైతం ఏకగ్రీవమయ్యాయి.
తణుకు మండలంలో
తణుకు మండలంలోని 9 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 22 మంది బరిలో నిలిచారు. ఐదు పంచాయతీల్లో ముఖాముఖి పోటీ, నాలుగు పంచాయతీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తం 110 వార్డులలో కొమరవరం 1, మండపాక 1, ఎర్రాయి చెరువులో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 106 వార్డులకు 248 బరిలో ఉన్నారు.
ఇరగవరం మండలంలో
ఇరగవరం మండలంలోని కావలిపురం పంచాయతీలో సర్పంచ్ పదవితో సహా వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 20 పంచాయతీల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. మండలంలోని 11 గ్రామాల్లో ముఖాముఖి పోటీ, ఆరు గ్రామాల్లో త్రిముఖ పోటీ, మూడు గ్రామాలకు చతుర్ముఖ పోటీ నెలకొంది.