ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ ఎన్నికలు - today west godavari district election latest news udpate

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లాలో కొవ్వూరు రెవెన్యూ డివిజన్​లోని కొవ్వూరు, నిడదవోలు, తణుకు, గోపాలపురం, ఆచంట, అసెంబ్లీ స్థానాల పరిధిలో 13 మండలాల్లో 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

the-second-phase-of-elections-ended-peacefully
పశ్చిమ గోదావరి ప్రశాంతంగా ముగిసిన రెండో దశ

By

Published : Feb 13, 2021, 10:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఆరున్నర నుంచి మూడున్నర వరకు పోలింగ్ సాగింది. సగటున జిల్లాలో 82 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కొవ్వూరు మండలంలో 87 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా పెనుగొండలో 76 శాతం పోలింగ్ జరిగింది.

చెదురుమదురు వివాదాలు మినహా..

జిల్లాలో 210 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రకటన వెలువడగా 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 2404వార్డుల స్థానాలకు ఎన్నికల ప్రకటన వెలువడగా 558 వార్డులు స్థానాలు ఏకగ్రీవం కాగా.. 1844 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిపారు. 13 మండలాల పరిధిలో ఏన్నికల నిర్వహణకు 2403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక కానిస్టేబుల్​ను ఉంచారు. చెదురుమదురు వివాదాలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

ఫలితాలు ఆలస్యం కావచ్చు...

ఆరుగంటలకు అధికారులు ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. రెండున్నర గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావటంతో. ముందుగా వార్డు స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. చాగల్లు, దేవరపల్లి, ఉండ్రాజవరం, పెనుగొండ, మార్కేరు, అత్తిలి, వేల్పూరు, దువ్వ గ్రామ పంచాయతీల్లో పదివేల పైగా ఓటింగ్ ఉండటం వల్ల.. ఓట్లలేక్కింపు అర్ధరాత్రి సమయం దాటే ఆస్కారం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details