పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకు టూరిజం బోటులో ట్రయల్ రన్ చేపట్టారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో ఈ విహారయాత్రను నిలిపివేశారు. 19 నెలలు తరువాత తిరిగి పాపికొండల విహారయాత్ర ట్రయల్ రన్ చేపట్టారు. ప్రయాణికుల భద్రత, ప్రస్తుత పరిస్థితిపై అధికారుల దృష్టి సారించారు. ట్రయల్ రన్‌కు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నది ప్రవాహం, సీజన్ల పరిస్థితి, బోటు నడిపే సీజన్లపై పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. ప్రమాదాలు జరగ కుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పాపికొండల విహారయాత్ర ట్రయల్ రన్ - పాపికొండల విహారయాత్ర ట్రైల్ రన్
రాష్ట్ర పర్యాటక శాఖ గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర ట్రయల్ రన్ని నిర్వహించింది. కచ్చులూరు బోటు ప్రమాదంతో నిలిపి వేసిన ఈ విహారయాత్రపై.. ప్రస్తుతం ట్రయల్ రన్ చేపట్టారు. ప్రయాణికుల భద్రత, ప్రస్తుత పరిస్థితిపై అధికారుల సమీక్షిస్తున్నారు.
పాపికొండలు