Trees cutting: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నరసాపురం పర్యటన నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవసరం ఉన్నా, లేకున్నా పట్టణం పరిధిలో పలు చోట్ల ఇష్టానుసారంగా చెట్లు తొలగించారు. నరసాపురం ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడ అందిస్తున్న.. చెట్లను పురపాలక సిబ్బంది నరికేశారు. రోడ్డుకు దూరంగా... విద్యుత్ తీగలకు అడ్డుగా లేకపోయినా... తొలగించారు. వాస్తవానికి ప్రాంతీయ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సీఎం.. సభా స్థలి నుంచే ప్రారంభిస్తారు. అయినా సీఎం కాన్వాయ్ లో నుంచి చూసేటపుడు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో సిబ్బంది చెట్లు నరికేసి... ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు నిలువ నీడ లేకుండా చేశారని స్థానికులు వాపోతున్నారు.
సారొస్తున్నారని.. చెట్లు నరికేశారు... - CM Convoy
Trees cutting: ముఖ్యమంత్రి జగన్ నరసాపురం పర్యటనలో భాగంగా ప్రాంతీయ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి పట్టణం పరిధిలో పలు చోట్ల ఉన్న చెట్లను ఇష్టానుసారంగా తొలగించారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు నిలువ నీడ లేకుండా చేశారని స్థానికులు వాపోతున్నారు.
సీఎం వస్తున్నారని చెట్ల నరికివేత
Last Updated : Nov 21, 2022, 12:03 PM IST