ఉపాధి కోసం చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శిరిగినీడి వెంకటేశ్వరరావు (38) కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటి మాదిరిగానే కూలి పనికి వెళ్లిన వెంకటేశ్వరరావు పనిలో భాగంగా చింత చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడిపోయాడు.
చెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి - చెట్టుపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం
పొట్టకూటి కోసం చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటంలో జరిగింది.
చెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును తోటి కూలీలు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య లావణ్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో రూ.17 లక్షలు చోరీ