వివాహితపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలానికి చెందిన ఓ వివాహిత... 2019 డిసెంబర్ 12న తన గ్రామ సమీపంలోని ఓ మందుల దుకాణం వద్దకు వెళ్లి తిరిగివస్తుండగా...అటువైపు ద్విచక్ర వాహనంపై వచ్చిన పరిచయస్తుడైన యాకోబు అనే వ్యక్తి మీ ఇంటి వద్ద దింపుతానని వాహనం ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. కొద్దిసేపటికి రెండు ద్విచక్ర వాహనాలపై అతని స్నేహితులు ఆరుగురు వ్యక్తులు వచ్చారు. వివాహితపై దౌర్జన్యం చేసి ఆమెకు మద్యం తాగించారు. అనంతరం వారంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారు మద్యం సేవిస్తుండగా వివాహిత అదనుచూసి తప్పించుకుని ఇంటికి వచ్చేసింది. నిందితులకు భయపడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రాత్రి సమయంలో మళ్లీ ఆమె నిద్రిస్తుండగా దుండగులు ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో... ఎట్టకేలకు అక్కడినుంచి తప్పించుకుని ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరులో వివాహిత గ్యాంగ్ రేప్... ఆలస్యంగా వెలుగులోకి! - వివాహిత పై గ్యాంగ్ రేప్...ఏలూరులో అలస్యంగా వెలుగులోకి!
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరుకు చెందిన ఓ వివాహితపై ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఏలూరులో వివాహిత పై గ్యాంగ్ రేప్
ఇవీ చదవండి..వేమన వర్శిటీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
Last Updated : Jan 8, 2020, 2:48 PM IST