ముఖ్యమంత్రి జగన్‌పై దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ బెయిల్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఐఏ పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్షాలను తారుమారు చేసే అవకాశముందని ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదించారు. కేసు ప్రముఖుల భద్రతకు సంబంధించిన అంశం అయినందున నిందితుడుని జైలు లోపల ఉంచాలని ఎన్ఐఏ న్యాయవాది కోరారు. దీనికి ఏకీభివించిన న్యాయస్థానం బెయిల్ను రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళతామని నిందితుడి తరఫు న్యాయవాది చెప్పారు. కాగా ఈ ఏడాది మే 22న శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ విడుదల అయ్యాడు.
జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు - bail
గతేడాది అక్టోబర్‌లో జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. ఎన్ఐఏ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
నిందితుడు శ్రీనివాస్