ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశు పోషకులకు అండగా ప్రభుత్వం

రాష్ట్రంలో పశుపోషణను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాసం, దాణాను తక్కువ ధరకు నాణ్యమైన మేతను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అధిక భారాన్ని తగ్గించటమే తమ ప్రధాన ధ్యేయమని సీఎం జగన్​ వెల్లడించారు.

goverment provided gross in subside
పశు పోషకులకు అండగా ప్రభుత్వం

By

Published : Oct 12, 2020, 11:02 AM IST

పశు పోషకులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాసం, దాణా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. పశు పోషణలో మేత అత్యంత కీలకం. కొన్నేళ్లుగా ఇది రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఈ కార్యక్రమం గురించి స్వయంగా వెల్లడించారు. దీనిద్వారా బయటి మార్కెట్‌ కంటే కాస్త తక్కువ ధరకు నాణ్యమైన మేత అందుతుందని అధికారులు చెబుతున్నారు.

పశుపోషకులకు ఎంతో ప్రయోజనం

ప్రభుత్వం చేపట్టిన నూతన కార్యక్రమంతో పశుపోషకులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నాణ్యత కలిగిన మేతను పొందవచ్ఛు ఇందులో అధికార యంత్రాంగం పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. అయితే ఐదు నుంచి పది మంది కలిసి ఆర్డర్‌ ఇస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కో రైతు నుంచి రెండు మెట్రిక్‌ టన్నుల మేత ఆర్డర్‌ వస్తే బాగుంటుందని భావిస్తున్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.- పి.శ్రీనివాసరావు, సంయుక్త సంచాలకుడు, పశుసంవర్ధక శాఖ, ఏలూరు

మార్కెట్‌ ధర కంటే తక్కువకు..

పశు పోషకులు తమకు ఏ రకమైన మేత ఎంత మేర కావాలో నిర్ణయించుకుని రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)ల్లో ఉండే కియోస్క్‌ యంత్రాల ద్వారా ఆర్డర్‌ ఇస్తారు. వారికి కావాల్సినంత మేతను ఆర్‌బీకేల ద్వారా అందిస్తారు. కంపెనీలకు నేరుగా ఆర్డర్‌ ఇవ్వడం ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువకు మేతలను పొందేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక కంపెనీకి చెందిన ఐదు కేజీల మిశ్రమ దాణా బస్తా బయటి మార్కెట్లో రూ.1200 ఉంటే.. ఆర్‌బీకేల ద్వారా రూ.800కే లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పైగా ఆర్డర్‌ ఇచ్చిన 48 గంటల్లో మేత రైతులకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మినరల్‌ మిక్చర్‌ (ఖనిజ లవణాలు కలిగిన) మేతను ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్నారు. ఇది కేజీ ధర బయటి మార్కెట్లో రూ.160 ఉండగా రూ.130కే రైతులు పొందుతున్నారు.

ratio

ఇదీ చదవండీ...'బ్లూ ఫ్లాగ్ బీచ్'గా రుషికొండకు అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details