ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ ఎస్సీ, ఎస్టీల ఆందోళన - east godavari podu farmers latest news

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటోన్న తమకు పట్టాలివ్వాలంటూ ఎస్సీ, ఎస్టీలు... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అర్హులను గుర్తించి సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

By

Published : Oct 22, 2019, 5:43 PM IST

Updated : Oct 22, 2019, 6:00 PM IST

పోడు భూముల పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని మన్యం మండలాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటోన్న తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. పట్టాల పేరుతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప నేటికీ అర్హులను గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.

Last Updated : Oct 22, 2019, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details