పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కూడవల్లి హనుమంతరావు ఓ సామాన్య రైతు. ఈయనకు ఇద్దరు కుమారులు. గత ప్రభుత్వ హయాంలో కోటి 20 లక్షల రూపాయల నిధులతో పంచాయతీ భవనం, డంపింగ్ యార్డ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, కళ్యాణ మండపం నిర్మాణాలు చేపట్టి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న రహదారి పనులు 30 లక్షలకు పనులు పూర్తి చేశారు.
ప్రభుత్వం మారడంతో వీరి కుటుంబ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. 30 లక్షలకు సంబంధించిన బిల్లులు రాక నివాసం ఉంటున్న ఒక్కగానొక్క ఇంటిని 10 లక్షలకు తాకట్టుపెట్టి తాత్కాలికంగా కొద్దిపాటి సర్దుబాటు చేసుకున్నారు. చదివించాల్సిన కుమారులతో... కూలి పనులకు పంపించి కుటుంబ జీవనం సాగిస్తున్నారు. రేషన్ బియ్యం కొనుక్కొని అదే పరమాన్నంగా.. బతుకు బండి ఈడుస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు రావాల్సిన సొమ్ము వస్తే గ్రామంలో తలెత్తుకు తిరగ గలనని, లేనిపక్షంలో మరింత సంక్షోభంలో పడిపోతానని హనుమంతరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు.