పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గడువును 2021 డిసెంబర్ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రతన్‌లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. కాంట్రాక్ట్ నిర్వహణ కారణాలతో గడువు పెంచినట్లు వెల్లడించింది. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ పూర్తయ్యే వరకు నిధుల విడుదల సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ నెలలో విడుదల చేసిన 1850 కోట్ల రూపాయలు కలిపి... ఇప్పటి వరకు మొత్తం 8614.16 కోట్లు పోలవరానికి ఇచ్చినట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్ 26నే ఈ విషయాన్ని లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన - పోలవరానికి నిధులు
పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువును పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిధుల విడుదలపైనా స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఖర్చుపై... ఆడిట్ పూర్తయ్యే వరకు నిధులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
polavaram project