పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసననసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొంతసేపు పారిశుద్ధ్య కార్మికుని అవతారమెత్తారు. కార్మికులతో కలిసి క్రిమిసంహారక రసాయనాలు వీధుల్లో పిచికారి చేశారు. పట్టణంలోని శివారు కాలనీలలో పారిశుద్ధ్య కార్మికులు పనితీరును పరిశీలించటానికి వెళ్లిన ఆయన... వారితో కలిసి మందులను పిచికారి చేశారు. పారిశుద్ధ్య పనులు అమలు జరుగుతున్న తీరును పరిశీలించటంతోపాటు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్రిమిసంహారక మందులను ప్రతీ ఇంటికి పిచికారి చేయించాలని అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్మికుని అవతారమెత్తిన తణుకు ఎమ్మెల్యే - పారిశుధ్యకార్మికుని అవతారమెత్తిన తణుకు ఎమ్మెల్యే
తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పారిశుద్ధ్య కార్మికుని అవతారమెత్తారు. ఆయన కార్మికుల పనితీరును పరిశీలించారు. ప్రతి ఇంటికి క్రిమిసంహారక మందును పిచికారి చేయాలని ఆదేశించారు.
thanuku-mla-visit-consistency-in-west-godavari