ఎర్రకాలువ వరద ఉద్ధృతితో ముంపునకు గురైన... పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో స్థానిక శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాలువ గట్టును పటిష్టం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
'వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - thanuku mla news
పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ఎర్రకాలువ వరద ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే