పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్టీలో ఉంటూ పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాపులపైన, నిన్న యాదవుల పైన, ఇప్పుడు రెడ్లలు ఇలా కులాలను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయవద్దని కోరారు. గతంలో జిల్లా నుంచి ఎన్నికైన వారు ఎంతో హుందాగా వ్యవహరించారని, ఎంతో గౌరవమైన క్షత్రియులుగా పుట్టిన మీరుమాత్రం క్షత్రియుల పరువు తీస్తున్నారని పేర్కొన్నారు.
ఐదు సంవత్సరాలు గడపగడపా తిరిగాం.. ఎన్నికలముందు వచ్చి మా ఏడుగురు ఎమ్మెల్యేల కష్టంతో ఎంపీ అయ్యి ప్రతిపక్షాలతో కలసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి మీ రాజులందరు పంపిస్తారన్నారు.