విద్యార్థులే సాంకేతికతకు సారథుల ని వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని డీఆర్‌డీఓ ఛైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెంలోని నిట్ 2,3 స్నాతకోత్సవాలు శనివారం నిర్వహించారు. 2016-20, 2017-21 విద్యా సంవత్సరాలకు సంబంధించిన 793 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. స్నాత కోత్సవాన్ని నిట్ పాలకమండలి అధ్యక్షురాలు మృదులా రమేష్ ప్రారంభించారు. డైరెక్టర్ సీఎస్పీ రావు తొలుత ప్రసంగించారు.నిట్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ సాగిన పరిణామాలు, అభివృద్ధి, క్యాంపస్ ఇంటర్య్వూలు, కొత్త కోర్సులు తదితర అంశాల గురించి వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కార్తీక్‌రెడ్డి 2016-20లో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బి.అనూష 2017-21లో టాపర్లుగా నిలిచారు. వీరితోపాటు రెండు విద్యాసంవత్సరాల్లో వారి విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులకు సతీష్‌రెడ్డి బంగారు పతకాలు అందించారు. అనంతరం అతిథులు ప్రసంగించారు.
ప్రత్యేక దుస్తులతో హాజరై విద్యార్థులు అందరి దృష్టీ ఆకర్షించారు.
2020 బ్యాచ్ ఆకు పచ్చ, 2021 బ్యాచ్ కాషాయ రంగు ధరించారు
మా పిల్లలు బంగారు కొండలు
తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే : ‘ప్రతిష్ఠాత్మక నిట్‌లో చదవటం, కోర్సులవారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రముఖుల నుంచి మా పిల్లలు బంగారు పతకాలు అందుకోవటం గొప్ప విషయం. ఈ అపురూప ఘట్టాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం’ అని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.తమ బిడ్డలు సాధించిన విజయాన్ని చూసి వారు మురిసిపోయారు. నిట్ స్నాతకోత్సవానికి వచ్చిన పలువురిని ‘న్యూస్‌టుడే’ పలకరించగా తమ పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కరోనాతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఆ ప్రభావం నిట్‌పై పడ నీయలేదు. విరామం లేకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాం. 2020లోనే మొదటి ఎంటెక్ బ్యాచ్ విద్యార్థులకు వర్చువల తరగతులు నిర్వహించాం. కొత్త భవనాలు నిర్మించాం. వచ్చే నాలుగేళ్లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. - సీఎస్‌పీరావు, నిట్ డైరెక్టర్