పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులోని మదనగోపాలస్వామి ఆలయం నీట మునిగింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుడి ప్రాంగణం, గర్భగుడిలోకి వరద నీరు చేరింది. స్వామివారి దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మోకాలిలోతు నీటిలోనే అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బల్లిపాడులో నీట మునిగిన ఆలయం - పశ్చిమ గోదావరి జిల్లాలో నీట మునిగిన ఆలయం
వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అత్తిలి మండలం బల్లిపాడు లోని ప్రసిద్ధ దేవాలయం నీటమునిగింది.
నీటమునిగిన ఆలయం