కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, తనను చైన్నై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారంటూ పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పని చేస్తున్నాననీ, కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన చెన్నై జీహెచ్ ఆసుపత్రిలో చేరినట్లు యువకుడు వివరించాడు. 8న కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యాక 2 రోజులు చికిత్స చేసి 10వ తేదీన డిశ్చార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
కరోనా ఉన్నా... ఆసుపత్రి నుంచి పంపించేశారు
దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాననీ, తినటానికి ఇంట్లో పండ్లు తప్ప ఏమీ లేవని వాపోయాడు. ఆన్లైన్లో ఆహారాన్ని తెప్పించుకునేందుకు ఆస్కారం లేదని వివరించాడు. తాను బయట తిరిగితే తన ద్వారా మరికొంత మందికి కరోనా సోకే ప్రమాదం ఉందనీ, తనకు చికిత్స అందించాలని వేడుకుంటున్నాడు. తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.
ఇదీ చదవండి:'ఇలా ఎంతసేపు నిరీక్షించాలి.. త్వరగా పంపండి'