TDP leaders Adireddy Vasu and Apparao released from Central Jail: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసులు ఈరోజు సాయంత్రం బెయిల్‌పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి ఆదిరెడ్డి వాసు, అప్పారావులు విడుదలకానున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకుని.. జై తెలుగుదేశం మంటూ నినాదాలు చేశారు. అనంతరం జైలు నుంచి విడుదలైన ఆదిరెడ్డి, అప్పారావులకు ఘన స్వాగతం పలికారు.
14 రోజుల రిమాండ్ విధింపు..జగజ్జనని చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలు జరిగాయంటూ ఈ నెల 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులైన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా న్యాయస్థానం హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరిని సీఐడీ అధికారులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న వారికి బెయిల్ మంజూరు ఈరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
ఎదిరించే శక్తి లేక వివిధ కేసుల్లో ఇరికించారు.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జై తెలుగుదేశం మంటూ నినాదాలు చేస్తూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆదిరెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమను ఎదిరించే శక్తి లేక వివిధ కేసుల్లో ఇరికించారని అన్నారు.