చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 90 వేల విలువ గల సరుకును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన పైడి పెద్దిరాజు, నిమ్మల ప్రభుకుమార్ కాగా... మరొకరు చింతలపూడి మండలం సీతానగరానికి చెందిన పమిడి రవితేజగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ సునీల్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - తెలంగాణ మద్యాన్ని పట్టుకున్న చింతలపూడి పోలీసులు
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 90 వేల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ మద్యం తరలిస్తున్న ముగ్గురు పట్టివేత