ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎంఎస్ఏ టీచర్లకు ఎస్ఎస్ఏ గ్రాంట్లతో సంబంధం లేకుండా... జీరో వన్ జీరో ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2018 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని... మిగిలిన ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని కేడర్లో ఉన్న ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టును తయారుచేసి డీఈవో వెబ్సైట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామన ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా - ఏలూరు డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా