పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఏపీటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విచ్చేసి తమ నిరసన తెలియజేశారు. ధర్నా కార్యక్రమానికి మద్దతుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి రద్దు చేసిన పద్ధతి చాలా దుర్మార్గం, అ ప్రజాస్వామ్యం అన్నారు. తాను ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఎమ్మెల్సీ పదవి ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఆయన అన్నారు.
ఏలూరులో ఏపీటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా - teachers dharna
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఏపీటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరులో ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా