పశ్చిమ గోదావరిజిల్లా యలమంచలి మండలం సీతమ్మచెరువు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న.. ఖండవల్లి రాజశేఖర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ప్రాణం వదిలారు. పాఠశాల విధుల్లో ఉన్న రాజశేఖర్‌కు తీవ్రమైన గుండెనొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. తోటిసిబ్బంది వచ్చి చూసేలోపు మృతిచెందాడు. ఉపాధ్యాయుడు రాజశేఖర్ పాలకొల్లులో నివాసం ఉంటున్నారు. సీతమ్మచెరువు ప్రాథమిక పాఠశాలకు పాలకొల్లు నుంచి వచ్చి వెళ్లేవారు. యథావిధిగా పాఠాశాలకు వచ్చి.. విధుల్లో ఉండగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చినట్లు తోటి సిబ్బంది తెలిపారు.
గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలి ఉపాధ్యాయుడు మృతి - పాఠశాలలోనే కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు మృతి
విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే ఉపాధ్యాయుడు కుప్పకూలి మృతి చెందాడు. తోటి సిబ్బంది వచ్చి చూసేలోపే తుదిశ్వాస విడిచారు. విధుల్లో ఉండగా తీవ్ర గుండెనొప్పి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి మండలంలో జరిగింది.
Teacher Death