Teacher Beats The Student: విద్యార్థినిని ఓ ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టడంతో ఊపిరాడక ఆసుపత్రి పాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. పట్టణంలో టైలర్ పేట మున్సిపల్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. మార్కులు తక్కువగా వచ్చాయని శ్రీరామలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు కొట్టారు. దీంతో విద్యార్ధినికి ఊపిరి అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మార్కులు తక్కువగా వస్తే తమకు చెప్పాలని.. కానీ కానీ విచక్షణారహితంగా కొట్టడం ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏమిటని వాపోయారు. ఉపాధ్యాయురాలుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.
మార్కులు తక్కువ వచ్చాయని.. ఆ టీచర్ ఏం చేసిందంటే..! - విద్యార్థిని విచక్షణ రహితంగాకొట్టిన ఉపాధ్యాయరాలు
Teacher Beats The Student: ప్రభుత్వాలు విద్యార్థులను కొట్టకూడదని ఎన్ని ఆంక్షలు విధించినా కొందరు ఉపాధ్యాయులు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన పశ్చిమ గోదామరిలో చోటు చేసుకుంది.
Teacher Beats The Student