ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అధికారం ఖాయం' - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు

వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు.

చింతమనేని ప్రభాకర్
చింతమనేని ప్రభాకర్

By

Published : Feb 26, 2020, 11:04 AM IST

తెదేపా నేతల ప్రసంగం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి మండల పార్టీ కమిటీలను మంగళవారం ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎంపిక చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు వసంత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గెలుపు ఓటములు సహజమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అధికార పార్టీ నాయకులు తెదేపా నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పరిశీలకుడు సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహిస్తున్నామన్నారు. అంతా ఒక అంగీకారానికి వచ్చి ఏకపక్షంగా ఎంపిక చేసుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్నారు. కార్యక్రమంలో నియోజవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details