పరిషత్ ఎన్నికల ఫలితాలలో(MPTC, ZPTC ELECTION RESULTS గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గ కేంద్రం ఆచంటలో వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. జడ్పీటీసీ(ZPTC) స్థానంతో పాటు మెజార్టీ ఎంపీటీసీ(MPTC) స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
MPTC, ZPTC ELECTION RESULTS: ఆ మంత్రి నియోజక వర్గంలో తెదేపా ఘన విజయం - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు
మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజక వర్గంలో పరిషత్(Parishath elections) ఎన్నికల్లో అధికార వైకాపాకు ఘోర పరాభవం ఎదురైంది. జడ్పీటీసీ స్థానంతో పాటు.. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది.
TDP
తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పలపాటి సురేష్ బాబు, ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి కడలి రామ గోవిందరాజుపై 2253 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. తెదేపా,జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగి 11 స్థానాలను కైవసం చేసుకుంది.కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు .
ఇదీ చదవండి