విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. పశ్చిమగోదావరిజిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తెదేపా నాయకులు ప్లకార్డులతో రోడ్లపై తిరుగుతూ నిరసన తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ భీమవరంలో ఆందోళన చేపట్టారు. పాలకొల్లు, ఉండి ఎమ్యెల్యేలు రామానాయుడు, మంతెన రామరాజులు నిరసన దీక్ష చేశారు. ఉంగటూరు, నిడదవోలు, తణుకు, నరసాపురంలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని వారు నినాదాలు చేశారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని తెదేపా నేతలు మండిపడ్డారు.
విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో తెదేపా నిరసన - tdp protest latest news in west godavari
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు నల్ల బాడ్జీలు ధరించి, ప్లకార్డులతో వీధి వీధి తిరుగుతూ నిరసన తెలిపారు.

tdp protest
TAGGED:
tdp protest for power bills