పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా ధర్నా చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారిలో కారుకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన చేపట్టారు. భారత్ పెట్రోలియం ఎదుట.. పెట్రోల్ డీజిల్ ధరలను గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు.
కరోనా విజృంభణ కొనసాగుతుండగానే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు ధరలను 40 సార్లు పైగా పెంచడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్న బాబు, మాజీ ఏఎంసీ ఛైర్మన్లు బసవ రామకృష్ణ, తోట సూర్యనారాయణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.