పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా తెదేపా మహాపాదయాత్ర నిర్వహించింది. ఎడ్లబజారు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర నరసాపురం ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పూర్తి చేసిన ఇళ్లను ఏడాదిన్నర అయినా ఇప్పటివరకు లబ్దిదారులకు అందజేయలేదని మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇల్లు అందజేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. శాసనమండలి సభ్యుడు అంగర రామ్మోహన్ మాట్లాడుతూ..లేనిపోని ఆరోపణలు చేస్తూ వైకాపా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందన్నారు.
పాలకొల్లులో పాదయాత్ర నిర్వహించిన తెదేపా - పాలకొల్లులో తెదేపా పాదయాత్ర
నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులో తెదేపా పాదయాత్ర నిర్వహించింది. ఎడ్ల బజారు నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నరసాపురం ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది.
పాలకొల్లులో పాదయాత్ర నిర్వహించిన తెదేపా
ఇదీ చదవండి
పోలవరం కాఫర్ డ్యామ్‌లను పరిశీలనకు సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం