పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామంలో తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గత నాలుగు ఆదివారాలుగా గ్రామంలోని 850 కుటుంబాలకు కూరగాయలు, నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ దాతలు చింతలపాటి రాంబాబు సహకారంతో గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, కిలో మంచి నూనె, కిలో గోధుమ రవ్వ పంపిణీ చేశారు.
ఎమ్మెల్సీ దాతృత్వం... 850 కుటుంబాలకు సరకుల పంపిణీ - mantena satyanaraya vegetable distribution in panduvva
పశ్చిమగోదావరి జిల్లా పాందువ్వ గ్రామంలో 850 కుంటుంబాలకు తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాతల సహకారంతో నాలుగు ఆదివారాలుగా గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ దాతృత్వం... 850 కుటుంబాలకు సరకులు పంపిణీ