పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నారా లోకేశ్ పై పోలీసులు కేసు నమోదు చేయడం, వైకాపా నాయకుల విమర్శలపై ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామరాజు స్పందించారు. రైతులను, ప్రజలను పరామర్శించి వారి ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి నారా లోకేశ్ ఆకివీడులో పర్యటించారని తెలిపారు. ట్రాక్టర్ ఘటనపై ఆయన మాట్లాడతూ.. ఆ రోడ్డులో ట్రాక్టర్ ప్రయాణం ఒకటే మార్గమని...జరిగిన చిన్నపాటి సంఘటనను భూతద్దంలో చూస్తున్నారని మండిపడ్డారు. ట్రాక్టర్ నడపడం రాని వాళ్లు రాష్ట్రాన్ని ఏం నడుపుతారన్న... వైకాపా నేతలపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. డ్రైవింగ్ కు, నాయకత్వానికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. రోడ్లు బాగు చేసి రైతుల నడ్డి విరగకుండా చూడాలని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి వల్లే నాయకుయ్యాడని...రామరాజు గుర్తు చేశారు.
వైకాపా నేతలపై మండిపడ్డ తెదేపా ఎమ్మెల్యే - ఆకివీడు లో వైకాపా నేతలపై మండిపడ్డ తెదేపా నేతలు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్లో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై కేసు నమోదు చేయడం, వైకాపా నాయకులు లోకేశ్‌ను విమర్శించడంపై ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్పందించారు. వైకాపా నాయకుల విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

వైకాపా నేతలపై మండిపడ్డ తెదేపా ఎమ్మెల్యే
Last Updated : Oct 29, 2020, 3:57 PM IST