అచ్చెన్నాయుడు అరెస్టు వెనుక భారీ కుట్ర: నిమ్మల - అచ్చెన్నాయుడు అరెసు న్యూస్
వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే నాయకులపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్టు వెనక భారీ కుట్ర ఉందన్నారు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
ప్రలోభాలకు లొంగని తెదేపా నాయకులను కేసుల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్టు వెనక భారీ కుట్ర ఉందన్నారు. ప్రభుత్వ అక్రమాలు వెలికి తీస్తున్నాడన్న ఉద్దేశంతో ఏసీబీ కేసుల పేరుతో అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఇసుక, మద్యం, ఇంటిస్థలాల అక్రమాలపై మాట్లాడే నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. తెదేపా నాయకులను బలవంతంగా వైకాపాలోకి చేర్చుకుంటున్న జగన్..లొంగని నాయకులను వేధిస్తూనే ఉంటారన్నారు.