పశ్చిమగోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా భోజనాన్ని రుచి చూసిన ఆయన... ఇందులో ఉప్పు తప్ప.. ఏమీ లేదని మండిపడ్డారు. ఇంత దారుణమైన భోజనాన్ని పిల్లలకు అందిస్తుండడం బాధాకరమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకో మెనూను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకో మెనూ' - తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు తాజా న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆకస్మికంగా పరిశీలించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు.. తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించారు.
'మధ్యాహ్న భోజన పథకంలో పేరుకే రోజుకొక మెనూ'
ఏక్తా శక్తి పౌండేషన్పై వస్తున్న ఫిర్యాదులతో.. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరీక్షించేందుకే ఇక్కడకు వచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పౌండేషన్పై గతేడాది లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని హైస్కూల్లో స్వచ్ఛందంగా నిలిపివేశారని తెలిపారు. ఈ పౌండేషన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.