ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచాయతీ ఎన్నికలపై కార్యకర్తలకు ఆరిమిల్లి రాధాకృష్ణ దిశానిర్దేశం

By

Published : Jan 31, 2021, 7:11 PM IST

Updated : Jan 31, 2021, 7:47 PM IST

పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు మజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారనుందన్నారు.

tdp meeting at tanuku on panchayati elections
పంచాయతీ ఎన్నికలపై కార్యకర్తలకు ఆరివెల్లి రామకృష్ణ దిశానిర్దేశం

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ దిశానిర్దేశం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తెదేపా విస్తృత స్థాయి సమావేశం వేల్పూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. వైకాపా ప్రభుత్వ పాలనలో 18 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత మనకు సానుకూలంగా మారనుందన్నారు.

పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీకి ఊహించని స్థితిలో ఫలితాలు రాబోతున్నాయని ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ ఫలితాల ప్రభావం తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

తణుకులో పల్స్పోలియో.. ప్రారంభించిన ఎమ్మెల్యే

Last Updated : Jan 31, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details