పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో తెలుగుదేశం నేత వడ్లపట్ల సుధాకర్ బాబు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం, 5 కేజీల గోధుమ రవ్వ, కేజీ ఖర్జూరం, కేజీ పంచదార, కేజీ సేమియా, నెయ్యి ఇతర వస్తువులను అందజేశారు.
ముస్లింలకు తెదేపా నేత రంజాన్ తోఫా - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వడ్లపట్ల సుధాకర్ బాబు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో ముస్లింలకు తెదేపా నేతలు రంజాన్ తోఫా కానుకలను అందజేశారు. ముస్లిం సోదరులు అంతా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

రంజాన్ తోఫా కనుకలు ఇచ్చిన తెదేపా నేతలు
గ్రామంలోని మసీదు వద్ద 45 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు . ముస్లిం సోదరులు అంతా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. గతంలో ప్రభుత్వం ముస్లిం సోదరులకు తోఫా ఇచ్చేదని... ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున తాము ఈ పని చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా వీటిని పంపిణీ చేస్తామన్నారు.