తెదేపా అధినేత ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్‌ను నేతలు పట్టాభిరాం, మాజీజడ్పీటీసీ సభ్యుడు ముళ్ళపూడి బాపిరాజు పరామర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు. పార్టీలకతీతంగా లోకేష్‌కు అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.
తాడేపల్లిగూడెంలో యువకుడిని పరామర్శించిన తెదేపా నేతలు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్‌ను తెదేపా నేతలు పరామర్శించారు. అతని ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నేతలు పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు బనాయించడం సరైంది కాదని నేతలు అభిప్రాయపడ్డారు. లోకేష్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన డీఎస్పీ, సీఐలను విధుల నుంచి తప్పించాలని కోరారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం పోకముందే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చదవండి :'మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైకాపా దోచేయడం దారుణం'