తెదేపా నేత, మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, రిమాండ్‌కు పంపడం ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని.. పశ్చిమగోదావరిజిల్లా తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేసులు నమోదు చేయడాన్ని మొదటిసారి చూస్తున్నామని తెలిపారు. తెలుగు దేశం నేతల గొంతు నొక్కడానికి ప్రభుత్వం కేసులు నమోదుచేస్తోందని మాజీ ఎమ్యెల్యే గన్నీ వీరాంజనేయులు ధ్వజమెత్తారు. ఇలాంటి సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్‌కే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.
'ఈ అరెస్టు కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం' - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు
తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిదర్శమని పశ్చిమగోదావరి జిల్లా తెదేపా నాయకులు ఆరోపించారు. చింతమనేనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో చింతమనేని ప్రభాకర్