పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైకాపా నేతల తీరుపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. కిందిస్థాయిలో నాయకులు అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థల పట్టాల నిమిత్తం డబ్బులు వసూలు చేశారని ఉండ్రాజవరం మండల తెదేపా అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ ఆరోపించారు. ఉండ్రాజవరంలో సైతం ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
'ఇళ్ల పట్టాల్లో వైకాపా కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారు' - west godavari politics news
వైైకాపా కార్యకర్తలు ఇళ్ల పట్టాల నిమిత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైకాపా నేతలు తీరుపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నేతలపై తెదేపా నేతల ఆగ్రహం
ఇదీ చదవండి: నెల్లూరులో అమానవీయం..కరోనాతో మృతి..జేసీబీతో ఖననం
Last Updated : Jul 11, 2020, 9:40 AM IST